భయం.. భయం...

ABN , First Publish Date - 2020-12-07T03:58:45+05:30 IST

మండలంలోని నక్కలపల్లి రహదారిలో శనివారం రాత్రి రోడ్డుకు అడ్డంగా కనబడిన పులి ఆదివారం ఉదయం మరోమారు ఇదే మార్గంలో ప్రత్యక్షమైంది.

భయం.. భయం...
అటవీ అధికారులు గుర్తించిన పులి అడుగులు

కోటపల్లి, నెన్నెల మండలాల్లో సంచారం

పత్తి చేనులో రైతుకు అగుపించిన పులి

ఆందోళనలో గ్రామాల ప్రజలు 


కోటపల్లి, డిసెంబరు 6 :  మండలంలోని నక్కలపల్లి రహదారిలో శనివారం రాత్రి రోడ్డుకు అడ్డంగా కనబడిన పులి ఆదివారం ఉదయం మరోమారు ఇదే మార్గంలో ప్రత్యక్షమైంది. నక్కలపల్లి సమీపంలోని బ్రహ్మణపల్లి   సరిహద్దు పత్తి చేనులో పత్తి బస్తాలను తెచ్చేందుకు బ్రహ్మణపల్లికి చెందిన కుర్మ శంకర్‌ అనే రైతు ఎడ్లబం డిలో చేనుకువెళ్లాడు. పత్తి బస్తాలను  చేనులో నుంచి రోడ్డుపైకి తెస్తున్న క్రమంలో పులి కనబడింది. వెంటనే కేకలు వేస్తూ రోడ్డుపైకి రాగా గ్రామ వీఆర్‌ఏ రాజేందర్‌ బైక్‌పై ఎదురుగా వచ్చాడు. ఇద్దరు కేకలు వేయడంతో పులి చేను దాటి అటవీ మార్గంలోకి వెళ్లిందని తెలిపారు. అనంతరం గ్రామస్థులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా రేంజర్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌, అటవీ సిబ్బంది చేనులో పులి అడుగులను గుర్తించారు. 


దగ్గరగా చూశాను...

- కుర్మ శంకర్‌ 

ఏరిన పత్తి బస్తాలు చేనులో ఉండగా బస్తాలను ఎడ్ల బండిలో వేసేందుకు ఎడ్లబండి వైపు వెళ్తుండగా వెనక వైపు నుంచి ఏదో కదిలినట్లు చప్పుడు వచ్చింది. వెనకకు తిరగగా పులి కనబడింది. దగ్గరగా పులిని చూశాను. భయంతో కేకలు పెడుతూ పరిగెత్తాను. పులి నన్ను ఏమ నలేదు. భయంతో వణికిపోయాను. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

పులి సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేంజర్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ హు స్సేన్‌ అన్నారు. పులి సంచరించిన పత్తి చేనులో అడు గులను గుర్తించారు. పత్తి చేన్లకు వెళ్లే కూలీలు జాగ్ర త్తలు పాటించాలని, పశువులు, మేకల కాపరులు అడ వికి వెళ్లవద్దన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్లపై ఒంటరిగా ప్రయాణం చేయవద్దని గ్రామస్థులకు సూచించారు. మరో వైపు బొప్పారం, నాగంపేట గ్రామా ల్లో కోటపల్లి రేంజర్‌ రవి ఆధ్వర్యంలో అటవీ అధికారులు కూలీలకు అవగాహన కల్పించారు. పత్తి చేన్లకు వెళ్లే కూలీలకు ప్రత్యేక మాస్కులు పంపిణీ చేశారు. ఈ మాస్కులు పెట్టుకొని వెళ్లాలని, దీంతో పులి దాడి చేసే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. 

 

పులిని భయపెట్టే మాస్క్‌  

  పులి దాడి చేయకుండా వెనకడుగు వేసేందుకు ఫేస్‌మాస్కులు వచ్చాయి. తల వెనక భాగంలో మాస్కు ధరించడం వల్ల పులి దాడి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని అటవీ అధికా రులు అంటున్నారు. మనుషుల తలపై హెయిర్‌ (వెం ట్రుకలు) కనబడడంతో సహజంగా జంతువులు ఆను కుని పులి దాడి చేస్తుందని, అదే వెనక భాగంలో వెంట్రుకలు కనబడకుండా మాస్కులు ధరించడం వల్ల పులి వెనకడుగు వేస్తుందని అటవీ అధికారులు తెలి పారు. ఆదివారం మండలంలోని నాగంపేట, బొప్పారం గ్రామాల్లో కోటపల్లి అటవీ శాఖ రేంజర్‌ రవి, బ్రహ్మ ణపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో నీల్వాయి రేంజర్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌లు కూలీలకు అవగాహన కల్పిస్తూ మా స్కులను పంపిణీ చేశారు. కూలీలంతా మాస్కులు ధరించి చేన్లలోకి వెళ్లాలని సూచించారు. మాస్కులు మంచిర్యాలలో అందుబాటులో ఉన్నాయని,  ఒక్కో దాని ధర రూ.40 ఉంటుందన్నారు. మొత్తానికి పులిని భయ పెట్టే మాస్కులు వచ్చాయని ప్రజలు సరదాగా నవ్వుకుంటున్నారు. 

 

కోటపల్లి అడవుల్లో జే1 పులి  

  కోటపల్లి మండల అడవు ల్లో సంచరిస్తున్న పులిని జే1 (జన్నారం -1) పులిగా అటవీ అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచా రం. రెండు రోజులుగా బొప్పారం, నక్కలపల్లి, బ్రహ్మణ పల్లి అటవీ ప్రాంతాలు, పత్తి చేన్లలో కనబడిన పులి కొత్తగా వచ్చిందని, అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. పులి అడుగుల గుర్తులు, ప్రత్యక్ష సాక్షుల కథ నం ఆధారంగా ఈ పులి అడవుల్లోకి కొత్తగా వచ్చిందే నని, అది జే1 అని గుర్తించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ అడవుల్లో కే4, ఏ2లు సంచరిస్తుండగా తాజాగా నక్క లపల్లి దారిలో శనివారం రాత్రి బైక్‌పై వస్తున్న యువకు లకు రోడ్డుకు అడ్డంగా పులి కనబడడం, ఆదివారం ఉదయం బ్రహ్మణపల్లి పత్తి చేనులో పులి ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఈ పులి చాలా పెద్దదిగా ఉండడం, దీనిపై ఏనిమల్‌ ట్రాకర్స్‌ పూర్తిస్ధాయిలో పరి శీలన జరిపి దీన్ని జే1గా గుర్తించారని తెలుస్తోంది.  పత్తి చేనులో నుంచి కుష్నపల్లి రేంజ్‌ వైపు వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ఏ పులి, ఎక్కడ నుంచి వచ్చిందని అటవీ అధికారులు స్పష్టంగా వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు. 

 

Updated Date - 2020-12-07T03:58:45+05:30 IST