‘ప్రజా సంక్షేమమే సర్కారు లక్ష్యం’

ABN , First Publish Date - 2020-09-06T09:03:21+05:30 IST

ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యమని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు...

‘ప్రజా సంక్షేమమే సర్కారు లక్ష్యం’

ఇచ్చోడ, సెప్టెంబరు5: ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యమని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. పార్కును సుందరం గా చేయాలని సూచించారు. ఇచ్చోడ నుంచి పార్కు వరకు రోడ్డు మార్గం ఉం డేలా చూడాలన్నారు. రోడ్డుకు ఇరువైపు లా ప్రత్యేకమైన మొక్కలు హరితహారం లో భాగంగా నాటాలని తెలిపారు. అ నంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత చౌహాన్‌, టీఆర్‌ ఎస్‌ మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌,  ఎంపీ పీ ప్రీతంరెడ్డి, ఉప సర్పంచ్‌, ఎంపీటీసీ దేవనంద్‌ పాల్గొన్నారు. 


బాధిత కుటుంబానికి పరామర్శ

గుడిహత్నూర్‌: మన్నూర్‌ మాజీ స ర్పంచ్‌ జలంధర్‌ తల్లి ఇటీవల మృతి చెందింది. శనివారం బాధిత కుటుంబా న్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ రాథోడ్‌పుండలిక్‌, టీఆర్‌ఎ స్‌ మండల అధ్యక్షుడు కరాడ్‌ బ్రహ్మనం ద్‌, సర్పంచ్‌ కుమ్రశంభు ఉన్నారు.


Updated Date - 2020-09-06T09:03:21+05:30 IST