‘పీఎస్‌ఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు’

ABN , First Publish Date - 2020-10-07T06:08:43+05:30 IST

మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు విమర్శిస్తే సహించేది లేదని

‘పీఎస్‌ఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు’

నస్పూర్‌, అక్టోబరు 6 : మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు  కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును ఎమ్మెల్యే తనయుడు విజిత్‌రావు విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ళ వేణు అన్నారు. నస్పూర్‌  ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 


ఏలాంటి స్వార్థంలేకుండా తమ నాయకులు నియోజక వర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విజిత్‌ రావు తమ నాయకుడిపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నా రు. కొక్కిరాల రఘుపతి రావు ట్రస్టు ద్వారా యేటా ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ కానుక చీరను ఈ ఏడాది అనివార్య కారణాల వల్ల సంక్రాంతికి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.  ఇదీ వరకు ఇచ్చిన వారితో పాటు కొత్త వారికి కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు ఆడేపు శ్యామల, కౌన్సిలర్‌ లావణ్య, మాజీ ఎంపీటీసీలు సీపతి మల్లేష్‌, బండారి మల్లేష్‌, గెల్లు మల్లేష్‌, నాయకులు రాంమూర్తి, దేవేందర్‌ పాల్గొన్నారు. 

Read more