గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించాలి

ABN , First Publish Date - 2020-12-30T03:57:02+05:30 IST

గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటిని అం దించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం సీఈఆర్‌ క్లబ్‌లో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరి గింది. విప్‌ మాట్లాడుతూ జనవరిలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికా రులకు సూచించారు.

గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించాలి
మందమర్రి సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

మందమర్రిరూరల్‌, డిసెంబరు 29: గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటిని అం దించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం సీఈఆర్‌ క్లబ్‌లో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరి గింది. విప్‌ మాట్లాడుతూ జనవరిలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేయాలని  అధికా రులకు సూచించారు. పాల చెట్టు నుంచి ఆవడం వరకు డబుల్‌ రోడ్డు మంజూరైం దని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల అభివృ ద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలి పారు. గ్రామాల్లో చేపడుతున్న డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని సూచిం చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, జడ్పీ టీసీ వేల్పుల రవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభా కర్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజ లింగు పాల్గొన్నారు.  

జైపూర్‌: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ పే ర్కొన్నారు. ఎంపీపీ గోదారి రమాదేవి అధ్య క్షతన జరిగిన మండల సమావేశంలో  మా ట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంద న్నారు. జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీడీవో కే నాగేశ్వర్‌రె ్డి, వైస్‌ ఎంపీపీ పి రమేష్‌,  సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

భీమారం: గ్రామంలోని విద్యుత్‌ సమస్య లను పరిష్కరించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విద్యుత్‌ సిబ్బందికి సూచించారు.  ఎంపీడీవో కార్యాలయంలో వైస్‌ఎంపీపీ  సమ్మయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం లో విప్‌ పాల్గొన్నారు. దాంపూర్‌, ఎల్కేశ్వరం, ఖాజీపల్లి, భీమారం, పోలంపల్లి గ్రామాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు లేక వైర్లు కిందకు వేలాడుతున్నాయని సర్పంచులు విన్నవించారు. శ్మశానవాటిక నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు విన్నవించారు.  

Updated Date - 2020-12-30T03:57:02+05:30 IST