మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , First Publish Date - 2020-12-12T05:26:11+05:30 IST
ఆసుపత్రికి వచ్చే ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా.కుడ్మెత మనోహాన్, నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ కమిటీ అధికారి డా.సాధన అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పీహెచ్‌సీ వారు తనిఖీ చేశా రు.
గుడిహత్నూర్, డిసెంబరు 11: ఆసుపత్రికి వచ్చే ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి డా.కుడ్మెత మనోహాన్, నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ కమిటీ అధికారి డా.సాధన అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పీహెచ్‌సీ వారు తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్ గది, ప్రసూతి గది, రక్త పరీక్షల గదితోపాటు ఆరోగ్య కేంద్ర ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారని, రాష్ట్ర స్థాయి అధికారుల బృందం త్వరలోనే ఆరోగ్య కేంద్రం పరిశీలనకు రానున్నట్లు, సిబ్బంది ఇది పూర్తి స్థాయిలో రికార్డులను సిద్ధం చేసుకొని ఉండాలని సూచించారు. వారి వెంట మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్, ల్యాబ్ టెక్నిషియన్ జీవన్, ఫార్మాసిస్టు శివాజి తదితరులున్నారు.
విధుల్లో చేరిన వైద్యాధికారి..
మండల వైద్యాధికారి శ్రీనివాస్ తిరిగి బాధ్యతలను చేపట్టారు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోగ్య కేంద్రంలో పని చేసే సిబ్బంది జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి పిర్యాదు చేయగా విచారణ నిమిత్తం ఆయనను మూడు నెలల క్రితం బోథ్ ఆరోగ్య కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించారు. విచారణ అనంతరం తిరిగి కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ డాక్టర్ శ్రీనివాస్‌ను గుడిహత్నూర్ వైద్యాధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడతో శుక్రవారం ఆయన విధుల్లో చేరారు.