ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2020-12-29T06:09:15+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు.
భైంసా, డిసెంబరు 28 : కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. భైంసాలో సోమవారం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాద్యక్షులు సింధే ఆనంద్‌రావ్‌పటేల్ పార్టీ జెండాను ఎగురవేసారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వహయాంలోనే రాష్ట్రంలో విశేష అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మైనార్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. లతీఫ్, భైంసా పట్టణ కమిటీ అధ్యక్షులు వడ్నపు శ్రీనివాస్, ముథోల్ నియోజకవర్గ ప్రతినిధులు సుదర్శన్, చొండి రాజేశ్వర్, ఫెరోజ్ ఖాన్.షెక్ ఆంజాద్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఖానాపూర్ : కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భవ దినోత్సవాన్ని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుగ్లావత్ కిషోర్‌నాయక్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వా సుపత్రిలో రోగులకు ఉచితంగా పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాబీర్‌పాషా, నియోజకవర్గ ప్రదాన కార్యదర్శి చింతపండు రవి, మండల నాయకులు మడిగెల అనిల్, సాయి నరేష్, దాసరి రాజన్న, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తదితరులున్నారు.
నిర్మల్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 28 : కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్స వాన్ని సోమవారం యూత్ కాంగ్రెస్ నిర్మల్‌లో ఘనంగా నిర్వహించింది. అధ్యక్షుడు ఇమ్రాన్‌ఉల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు చరణ్‌మౌర్య, పట్టణాఽ ద్యక్షుడు నాందేడపు చిన్ను, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ సయ్యద్ అర్షద్, నితిన్, రాహుల్ పాల్గొన్నారు.