ఘనంగా సాయి పల్లకీ ఊరేగింపు

ABN , First Publish Date - 2020-12-28T06:11:58+05:30 IST

జిల్లా కేంద్రంలోని పుర వీధులు సాయి నామస్మరణతో మార్మోగాయి. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి పల్లకీ సేవ శోభయాత్రకు అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా సాయి పల్లకీ ఊరేగింపు
సాయినాథుడి పల్లకీ సేవ నిర్వహిస్తున్న భక్తులు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 26: జిల్లా కేంద్రంలోని పుర వీధులు సాయి నామస్మరణతో మార్మోగాయి. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సాయి పల్లకీ సేవ శోభయాత్రకు అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్థానిక చింతకుంటవాడ, కొత్త బస్టాండ్‌, బుధవార్‌పేట్‌, గాంధీచౌక్‌, పాత బస్టాండ్‌ ప్రాంతాల మీదుగా పల్లకీ సేవా కొనసాగింది. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులకు అన్నదాన ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులు లక్కడి జైపాల్‌ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:11:58+05:30 IST