రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు

ABN , First Publish Date - 2020-10-03T10:32:04+05:30 IST

జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు

జిల్లాలోని ఆయా మండలాల్లో ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్రం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 


ఏసీసీ, అక్టోబరు 2 : జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు జోగుల సదానందం, మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, మున్సిపల్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లు వేములపల్లి సంజీవ్‌, అబ్దుల్‌ మజీద్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రామగిరి భానేష్‌, బనావత్‌ ప్రకాష్‌ నాయక్‌, సల్ల మహేష్‌, మోతె సుజాత, కొండ పద్మ చంద్రశేఖర్‌, పూదరి సునీత ప్రభాకర్‌, నాంపల్లి మాదవి శ్రీనివాస్‌, సుజాత మల్లేష్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మంచిర్యాల కలెక్టరేట్‌: వ్యవసాయ రంగాన్ని కార్పోరేటర్లకు అప్పగించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడు బిల్లులను ఆమోదించిందని, ఆ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లాల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ బిల్లుకు నిరసనగా గాంధీజీ విగ్రహం ఎదుట నినాదాలు చేసి వినతిపత్రం సమర్పించారు.  కార్యక్రమంలో నాయకులు టి. శ్రీనివాస్‌, బ్రహ్మానందం, సాంబయ్య, మొబిన్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


నస్పూర్‌: పట్టణంలోని సీసీసీ కార్నర్‌ వద్ద జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌ సాగర్‌ రావు అద్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ళ వేణు, కౌన్సిలర్లు సీపతి సుమతీ మల్లేష్‌, బొద్దున సంధ్యారాణి, రజిత, మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్యామల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


హాజీపూర్‌: మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


దండేపల్లి: రైతులను ఆర్ధికంగా నష్ట పరచడానికే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణ బిల్లు తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంకెట అన్వేష్‌రెడ్డి,  డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గడ్డం నాగరాణి-త్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు  అక్కల వెంకటేశ్వర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు అక్కల శకుంతల, పెంట రజిత, కాంతరావు, బ్లాక్‌కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వనపర్తి రవి, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్‌, బొడ్డు కమలాకర్‌, నవీన్‌, మన్నెమ్మ, సర్పంచ్‌లు శంకరయ్య, శ్రీనివాస్‌, చంద్రకళ నాయకులు రాజన్న, దుర్గప్రసాద్‌, సతీష్‌, వినయ్‌, నవీన్‌, రాహుల్‌, సత్తయ్య, రాజేష్‌, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మందమర్రిటౌన్‌: కిసాన్‌ మజ్దూర్‌ బచావో దివస్‌ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జయశంకర్‌ చౌరస్తా రాష్ట్రీయ రహదారి వద్ద కాంగ్రెస్‌ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీఈ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు, నాయకులు రఘునాధ్‌రెడ్డి, ముజాయిద్‌, కొప్పుల రమేష్‌, నోముల ఉపేందర్‌గౌడ్‌, జీవన్‌, రాజు, రజనీ, సుకుర్‌, జమీల్‌, సత్యనా రాయణ, సంతోష్‌గౌడ్‌, అనూష, రాధ , దేవేందర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


కోటపల్లి: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు కాట్రాల మల్లయ్య, మాజీ జడ్పీటీసీ పోటు రామిరెడ్డి, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుఖేందర్‌, నాయకులు ఎన్నం భాస్కర్‌, పున్నం, బాపు తదితరులు పాల్గొన్నారు. 


బెల్లంపల్లి టౌన్‌:  కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన  రైతు వ్యతిరేక బిలల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం జీవోను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ  నాయకులు బెల్లంపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్య్యక్షుడు అన్వేష్‌రెడ్డి, టీసీసీ కార్యదర్శులు మత్తమారి సూరిబాబు, చిలుముల శంకర్‌, మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్‌, కాంగ్రెస్‌ పార్టీ  పట్టణ అద్యక్షుడు కంకతి  శ్రీనివాస్‌,  ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అద్యక్షుడు ఆదర్శవర్దన్‌రాజు, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బండి ప్రభాకర్‌యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాద్యక్షుడు  మల్లేష్‌, మహిళా రాష్ట్ర  కార్యదర్శి రొడ్డ శారద, మున్సిపల్‌ కాంగ్రెస్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కటకం సతీష్‌, ఎంపీటీసీ ముడిమడుగుల  మహేందర్‌,  పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మేకల శ్రీనివాస్‌,  రమేష్‌బాబు,  రామగిరి శ్రీనివాస్‌, రోహిత్‌, కే రాంమోహన్‌, విజయ్‌కుమార్‌, వినేష్‌, పి హరీష్‌, కొంతం రమేష్‌, మల్లారపు చిన్నరాజం, మహేష్‌, శంకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


తాండూర్‌(బెల్లంపల్లి):  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును  ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తాండూర్‌ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, నాయకులు సూరం రవీందర్‌రెడ్డి, యశోద, గట్టు మురళీదర్‌రావు, కడారి రత్నాకర్‌ , ఆలీ, పద్మ, చరణ్‌, శ్రీను, లింగయ్య, రవి, శ్రీను, షేక్‌ అహహ్మద్‌,  పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


కాసిపేట: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు నిరస తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సిద్దం తిరుపతి, పార్టీ జిల్లా కార్యదర్శి వేముల కృష్ణ, ధర్మారావుపేట ఎంపీటీసీ మల్లేష్‌, దేవాపూర్‌ ఎంపీటీసీ మేరుగుపద్మశంకర్‌, నాయకులు భారతాని సతీష్‌, కనకరాజు, వేణు, షాకీర్‌, గోలేటి స్వామి, శివ, దేవేందర్‌, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T10:32:04+05:30 IST