రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి

ABN , First Publish Date - 2020-06-18T10:50:52+05:30 IST

సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కొండయ్య అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్టులో కాలరీ మేనేజర్‌గా పనిచేస్తూ ఇందారంకు బదిలీపై వెళ్తున్న ఉమాకాంత్‌

రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి

రెబ్బెన, జూన్‌17: సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కొండయ్య అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్టులో కాలరీ మేనేజర్‌గా పనిచేస్తూ ఇందారంకు బదిలీపై వెళ్తున్న ఉమాకాంత్‌ సేవలు అభినందనీయమని జీఎం అన్నారు.


బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఆయనకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని కైరిగూడ, డోర్లి ఓపెన్‌ కాస్టులలో కాలరీ మేనేజర్‌గా పనిచేసిన ఉమాకాంత్‌ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉమాకాంత్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం సాయిబాబు, ప్రాజెక్టు ఆఫీసర్‌ పురుషోత్తం రెడ్డి, రమేష్‌, డీజీఎం యోహన్‌, ఏరియా ఇంజనీరు కమలాకరభూషణ్‌, డీజీఎం వర్‌్‌క షాప్‌ శివరామిరెడ్డి, రాజాజీ, పర్సనల్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌రావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T10:50:52+05:30 IST