గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదన

ABN , First Publish Date - 2020-11-13T10:36:58+05:30 IST

కొత్తగా ఏర్పడిన క్యాతనపల్లి, నస్పూర్‌, కన్నెపల్లి, హాజీపూర్‌ మండలాలకు శాఖ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌ పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లిలో

గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదన

రామకృష్ణాపూర్‌, నవంబరు 12 : కొత్తగా ఏర్పడిన క్యాతనపల్లి, నస్పూర్‌, కన్నెపల్లి, హాజీపూర్‌ మండలాలకు శాఖ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్‌  రేణికుంట్ల ప్రవీణ్‌ పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్యాతనపల్లిలో కొందరు తమ స్వంత ఖర్చులతో గ్రంథాలయమని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ఈ మధ్య క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చినట్లు జరిగిన ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితో క్యాతనపల్లిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లిలో అధునాతన హంగులతో గ్రంథాలయాలను తీర్చిదిద్దామని తెలిపారు. 

Updated Date - 2020-11-13T10:36:58+05:30 IST