డీటీడీవోలకు పదోన్నతులు

ABN , First Publish Date - 2020-11-28T04:50:23+05:30 IST

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న ఆరుగురు అధికారులకు డిప్యూటీ డైరెక్టర్లుగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

డీటీడీవోలకు పదోన్నతులు

ఉట్నూర్‌, నవంబరు 27: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న ఆరుగురు అధికారులకు డిప్యూటీ డైరెక్టర్లుగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ డీటీడీవో సంధ్యారాణిని  ఉట్నూర్‌ డీడీగా, అష్టనాయక్‌ను ఖమ్మం డీడీగా, పోచంను మహాబుబాబాద్‌ డీడీగా, పి.మానెమ్మను కేబీ ఆసిఫాబాద్‌ డీడీగా, ఆర్‌ రమాదేవిని భద్రాచలం డీడీగా, విజయలక్ష్మిని డిప్యూటీ సెక్రటరీగా గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read more