జయశంకర్ సార్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం: జైపాల్ రెడ్డి

ABN , First Publish Date - 2020-06-22T19:43:20+05:30 IST

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృత్యర్థం ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

జయశంకర్ సార్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం: జైపాల్ రెడ్డి

ఎల్బీ నగర్: ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృత్యర్థం ఎల్బీ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషిని, సిద్ధాంత కర్తగా ఆయన అధ్యయనాన్ని యువతకు మరింత చేరువ చేసేలా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఎల్బీ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెచ్చిన తెలంగాణను జాగ్రత్తగా కాపాడుకోవడంలో, పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు పునరంకితమవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు షఫీ, శ్రావణ్ కుమార్, జాకెర్, కరీం, శివ, ప్రభాకర్, యూసుఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-22T19:43:20+05:30 IST