సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-10-07T06:06:34+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో పని చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి

సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 


తాండూర్‌(బెల్లంపల్లి), అక్టోబరు 6 :  అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో పని చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం తాండూర్‌ మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తుందని చెప్పారు. నిధులను సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని పేర్కొన్నారు.


విద్యుత్‌, వైద్య శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో నివేదికలు చదువుతుండగా పలువురు ఎంపీటీసీలు విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు రేషన్‌ సరుకుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని , సమస్య పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పలువురు సభ్యులు కోరారు. తాండూర్‌ గ్రామంలో పశువైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో మూగజీవాల వైద్యం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు. మండలంలో విద్యుత్‌ సమస్య ఏర్పడకుండా అధికారులు పలు చర్యలు తీసుకోవాలని , విద్యుత్‌ ఫీడర్‌ కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే మామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. సమావేశంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం  కళ్యాణి, ఎంపీపీ ప్రణయ్‌, జెడ్పీటీసీ బానయ్య, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-07T06:06:34+05:30 IST