ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

ABN , First Publish Date - 2020-12-28T03:40:32+05:30 IST

ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆసిఫాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు.

ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి
గెలుపొందిన జట్టుకు బహుమతి అందజేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

 -ఆసిఫాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు
కాగజ్‌నగర్‌, డిసెంబరు 27: ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆసిఫాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ ఎస్పీఎం క్రీడా మైదానంలో మార్వడీ సమాజ్‌, మార్వడీ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ జట్టు గెలుపొందగా, కరీనంగర్‌ జట్టు రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మార్వడీ సమాజ్‌, మార్వడీ క్రికెట్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T03:40:32+05:30 IST