ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కుట్ర
ABN , First Publish Date - 2020-11-27T04:44:16+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోకేష్, శ్రీనివాస్‌లు అన్నారు.

-సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లోకేష్
ఆసిఫాబాద్, నవంబరు26: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోకేష్, శ్రీనివాస్‌లు అన్నారు. గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆసిఫాబాద్ పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన జిల్లా ఆసుపత్రి నుంచి వివేకానందచౌక్, గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్‌ల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ సర్కార్ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగాం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రీ సత్యనారయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దిన్‌కర్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు ఉమదేవి, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వరూప, గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు శంకర్, భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.