పైపై మెరుగులకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-16T03:57:20+05:30 IST

అభివృ ద్ధిని గాలికొదిలి పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇసు ్తన్నారు మంచిర్యాల మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు. ప్రజలకు ఉపయోగపడని పనులు చేప డుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారు.

పైపై మెరుగులకు ప్రాధాన్యం
విద్యుత్‌ స్తంబానికి ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ రోప్‌ లైట్లు

ప్రజల సమస్యలు పట్టని పాలకవర్గం

అభివృద్ధి పనులకు లభించని మోక్షం

మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రజాధనం వృథా

రూ.16 లక్షల పై చిలుకు నిధులు దుర్వినియోగం


మంచిర్యాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అభివృ ద్ధిని గాలికొదిలి పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇసు ్తన్నారు మంచిర్యాల మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు. ప్రజలకు ఉపయోగపడని పనులు చేప డుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్‌ స్తంభాల అలంకరణకు పాటుపడుతున్నారు. రాత్రి వేళల్లో లైట్ల ను ధగధగ మెరిపిస్తూ ఇదే అభివృద్ధి అంటూ భుజా లు ఎగురవేస్తున్నారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తదితర సౌకర్యాలపై దృష్టి సారించేందుకు  ముందు కు రావడం లేదు. ఫలితంగా జిల్లా కేంద్రం అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేడ్‌-1 మున్సిపాలి టీగా పేరొందిన మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రస్తు తం సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 


మరుగునపడ్డ బయో టాయిలెట్లు...

పట్టణ ప్రగతిలో భాగంగా రూ.10 లక్షలతో మహిళ ల కోసం సద్దుల బతుకమ్మ పండుగ సమయంలో రెండు మొబైల్‌ బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఒక్కొక్కటి రూ.5 లక్షలతో రెండు ఆర్టీసీ పాత బస్సులను కొనుగోలు చేశారు. వీటిలో మహిళల అవసరాల కోసం టాయిలైట్లు, ఇత ర సౌకర్యాలు కల్పించారు. రెండు వాహనాలకు ఇద్దరు డ్రైవర్లను  కేటాయించారు. రాళ్లవాగు వద్ద బతుకమ్మ నిమజ్జన స్థలంలో మొబైల్‌ బయో టాయిలెట్ల వాహ నాలు ఏర్పాటు చేశారు. అనంతరం బస్సులు ఎక్కడా కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని రైతు బజార్‌లో ఓ మూలన పడి ఉన్నాయి. డ్రైవర్లు లేకనే వాహనాలను నడపడం లేదని మున్సిపల్‌ అధికారులు పేర్కొనడం కొసమెరుపు. 


పై మెరుగులకు రూ. 6 లక్షల పై చిలుకు...

పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్‌ స్తంబాలను సుందరీకరించాలని నిర్ణయించా రు. ఇందులో భాగంగా సెంట్రల్‌ లైటింగ్‌ పోల్స్‌తో పాటు వంతెనల పక్కన విద్యుత్‌ స్తంబాలకు రోప్‌ ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.  మొత్తం 180 పై చిలుకు స్తంభాలను ఎంపిక చేశారు. ఎల్‌ఈడీ లైట్లలో రెండు రకాలను ఎంపిక చేశారు. కార్డ్‌ వైర్‌ మీటర్‌ రూ.60, రోప్‌ వైర్‌ రూ.130 నిర్ణయిస్తూ  టెండర్లను ఆహ్వానించారు. టెండర్లలో కార్డు వైరుకు రూ.46, రోప్‌ వైరుకు రూ.101 కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు చేపట్టే బాధ్యతలను అప్పగించారు. అయితే బహిరంగ మార్కెట్లో మీటర్‌ రోప్‌ వైరు ధర రూ.50 నుంచి 60  ఉన్నట్లు సమాచారం. దీనికి రూ.130 ధర ఎలా నిర్ణయించారో సంబంధిత అఽధికారులకే తెలియాలి.  ఒక్కో విద్యుత్‌ స్తంభానికి దాదాపు 25 నుంచి 35 మీటర్ల రోప్‌ వైరు అవసరం ఉంటుంది. కాంట్రాక్టరు కోట్‌ చేసిన దాని ప్రకారం మీటర్‌కు రూ.101 చొప్పున ఒక్కో స్తంభానికి 35 మీటర్ల దాదాపు రూ.3500 ఖర్చు అవుతుంది. అలా 180 స్తంభాలకు సుమారు రూ. 6 లక్షలు పైచిలుకు ప్రజాధనం ఖర్చు చేశారు. అయితే కౌన్సిలర్‌ తన వార్డులో రెండు స్తంభాలకు సొంత ఖర్చులతో రోప్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ వేయించగా, ఒక్కో మీటర్‌కు రూ.30 మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపా రు. అదే మున్సిపాలిటీ తరుపున వేసిన రోప్‌ లైట్లు మీటరు రూ.101 ఖర్చు చేశారు.  


అభివృద్ధిపై దృష్టి ఏదీ...?

ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై పాలకవర్గ సభ్యులు దృష్టి సారించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతాల్లో ఇప్ప టికీ సరియైన రోడ్లు లేకపోగా, డ్రైనేజీ వ్యవస్థ అస్త వ్యస్థంగా తయారైంది. డ్రైనేజీలు లేక మురికి నీరంతా రోడ్లపైన పారుతోంది. మరికొన్ని పాంత్రాల్లో  వీధిలై ట్లు కూడా లేవు. ఐబీ నుంచి పాత మంచిర్యాల వం తెన వరకు జాతీయ రహదారిపై డివైడర్లు నిర్మిం చాలన్న ప్రతిపాదనకు ఆమోద యోగ్యం లభించడం లేదు.  


డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉంది....

మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి

మున్సిపాలిటీలో డ్రైవర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న వారిని పారిశుధ్య వాహనాల కోసం వినియో గిస్తున్నాం. బయో మొబైల్‌ టాయిలెట్‌ వాహనాలను నడిపేందుకు ప్రస్తుతం డ్రైవర్లు అందుబాటులో లేరు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్ల డం జరిగింది. విద్యుత్‌ స్తంభాలకు ఎల్‌ఈడీ రోప్‌ లైట్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నందున మంచి ర్యాలలో ఏర్పాటు చేశాం.




Updated Date - 2020-12-16T03:57:20+05:30 IST