ముగిసిన ఛట్‌ పూజలు

ABN , First Publish Date - 2020-11-22T04:31:22+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం ఛట్‌ పూజలు ముగిశాయి. ఛట్‌ పూజలు దీపావళి పండుగ తర్వాత ఆరు రోజుల నుంచి చేస్తారు.

ముగిసిన ఛట్‌ పూజలు
కొలనులో పూజలు నిర్వహిస్తున్న మహిళలు

కాగజ్‌నగర్‌, నవంబరు 21: కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం ఛట్‌ పూజలు ముగిశాయి. ఛట్‌ పూజలు దీపావళి పండుగ తర్వాత ఆరు రోజుల నుంచి చేస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి సూర్యస్తమయం వరకు సూర్యబాగవనుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సూర్యోదయం వచ్చేంత వరకు నీటి కొలనులో ఉండీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసాద వితరన కార్యక్రమం చేపట్టారు. ఛట్‌ పూజలను జిల్లా జడ్పీ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Read more