పరవళ్ళు తొక్కుతున్న ప్రాణహిత...

ABN , First Publish Date - 2020-08-12T10:10:13+05:30 IST

కోటపల్లి మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ

పరవళ్ళు తొక్కుతున్న ప్రాణహిత...

కోటపల్లి, ఆగస్టు 11 : కోటపల్లి మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నిం డుగా ప్రవహిస్తోంది. వర్షాలతో వాగులు, వంకలలోని వరద నీరు ప్రాణహిత నదిలో కలుస్తుండటంతో నది ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. మంగళవారం అటు, ఇటు వైపులా ఒడ్లను తాకుతూ వరద పోటెత్తింది.  వెంచపల్లి వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండగా జనగామ, సూపాక, ఆల్గామా, పుల్లగామా, సిర్సా, అన్నా రం, అర్జునగుట్ట, రాపన్‌పల్లి గ్రామాల వద్ద ఒడ్లపాలెం వరకు వరద కొనసాగింది. దేవులవాడ వద్ద గోదావరి నదితో ప్రాణహిత ప్రవాహం కలిసి మరింత ఉధృతంగా పెరిగి లక్ష్మిబ్యారేజ్‌ వైపు ప్రవాహం కొనసాగుతోంది.

Updated Date - 2020-08-12T10:10:13+05:30 IST