ప్రజాచైతన్యంతోనే నేరాలు తగ్గు ముఖం

ABN , First Publish Date - 2020-11-22T03:33:28+05:30 IST

ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా ఉంటూ చైతన్యం కలిగించడం వల్ల నేరాలు తగ్గు ముఖం పట్టాయని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజాచైతన్యంతోనే నేరాలు తగ్గు ముఖం
మాట్లాడుతున్న డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి

శ్రీరాంపూర్‌, నవంబరు 21: ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా ఉంటూ చైతన్యం కలిగించడం వల్ల నేరాలు తగ్గు ముఖం పట్టాయని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం  శ్రీరాం పూర్‌ పోలీస్‌సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. పోలీసులు తీసుకుంటు న్న సామాజిక చైతన్య కార్యక్రమాలతో నేరాలు తగ్గాయని అన్నారు. కేవలం అప్పుడప్పుడు సైబర్‌ నేరాలు, చీటింగ్‌ కేసులు జరుగుతు న్నప్పటికీ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పునరావృతం కాకుండా  చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నా రు. పీడీఎఫ్‌ బియ్యం అక్రమ రవాణా ను నిరోధించామని అన్నారు. శ్రీరాం పూర్‌ పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల రూరల్‌ సర్కిల్‌ పరిధిలో విలీనం చేస్తున్నారన్న సమాచారం వాస్తవం కాదన్నారు. జాతీయ రహ దారిపై డివైడర్‌లు, సెంటర్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పా టు, స్పీడ్‌గన్‌ల వినియోగంతో వాహనాల అతివేగా న్ని నియంత్రిస్తూ ప్రమాదాలు పూర్తిగా నివారించ గలిగామన్నారు. యేటా 20శాతం వాహనాల కొనుగోలు జరుగుతున్నా యని, పార్కింగ్‌ స్థలాలు లేక ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించడం వల్ల  జరిమానా లు విధించడం తప్పడం లేదన్నారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌,  సీఐ బిల్లాకోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌, ఎస్‌ఐలు రామ కృష్ణ,  సంజీవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T03:33:28+05:30 IST