సరిహద్దులో పోలీసుల నిఘా

ABN , First Publish Date - 2020-03-23T10:40:55+05:30 IST

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలో గల సిరిపెల్లి గ్రామ సమీపంలో తెలంగాణ సరిహద్దులో జనతా కర్ఫ్యూలో

సరిహద్దులో పోలీసుల నిఘా

సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు 


సారంగాపూర్‌, మార్చి 22 : నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలో గల సిరిపెల్లి గ్రామ సమీపంలో తెలంగాణ సరిహద్దులో జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే సరిహద్దులో పోలీసులు గ్రామాల్లోని వీధులలో ఇంటి నుంచి ప్రజలు ఆరుబయటకు రావద్దని ప్రచారం చేశారు. దీంతో గ్రామాల్లో ప్రజలు ఇంటి లోపల నుంచి ఆరుబయటకు రాలేదు. రోడ్ల పైకి వా హనాలు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 


వాహనాల రాకపోకలు నిల్చిపోయాయి...

మహారాష్ట్ర నుంచి ఏ వాహనాలు తెలంగాణాకు వచ్చినా వా హనాలు సరిహద్దులో నిలిపి వేయించారు. ఎస్సై రాంనర్సింహ రె డ్డి ఆదిలాబాద్‌ నిర్మల్‌ హదారిపై గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. రాకపోకలు కొనసాగలేవు. మహారాష్ట్ర, కిన్వట్‌ డివిజన్‌ ఇన్‌చా ర్జి డీఎస్పీ ముదిరాజ్‌ సాహెబ్‌ సరిహద్దులను పరిశీలించి ఏ వా హనాలు వదిలి పెట్టవద్దని మహారాష్ట్ర పోలీసులతో పేర్కొన్నారు.


ఇళ్లకే పరిమితమైన ప్రజలు..

కరోనా వైరస్‌లో భాగంగా జనతా కర్ఫ్యూ విధించడంతో మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉదయం నుండి రాత్రి వరకు ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో రోడ్ల పైన ఎవరు కనిపించకపోవడంతో గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో బంద్‌ ప్రశాంతంగా కనిపించింది. 


సరిహద్దులో వైద్య సిబ్బంది..

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వైద్యులు అవినాష్‌ ఆధ్వ ర్యంలో వైద్య సిబ్బంది నియమించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. దీంతో ఏదైనా అత్యవసర సమయంలో వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వచ్చిన వ్యాధిగ్రస్థులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందించారు. 


సరిహద్దు ప్రాంతంను పరిశీలించిన అదనపు ఎస్పీ

మండలంలోని సిరిపెల్లిలో గల తెలంగాణ సరిహద్దు ప్రాంతం అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డిలు పరిశీలించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా మహారాష్ట్ర ప్రాంతంలో నుంచి వాహనాలు రాకుండా చూడాలని సరిహద్దులో పహరా కాస్తున్న పోలీసులకు సూచనలను ఇచ్చారు. సోమవారం ఉదయం వరకు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆయన వెంట ఎస్సై రాంనర్సింహ రెడ్డి అధికారులు ఉన్నారు.


మహారాష్ట్ర సరిహద్దు మూసి వేత

బాసర : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాసర మండలం బిద్రెల్లి గ్రామం మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిని పోలీసులు, రెవెన్యూ అధికారులు మూసి వేశారు. రోడ్డుకు అడ్డంగా భారీ కెడ్ల ను ఉంచి రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడి వాహనాలను ఇ టువైపు ఇక్కడి వారిని అటువైపు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తు తానికైతే ఈ చెక్‌పోస్టు సోమవారం ఉదయం వరకు ఉంటుంది. ఒకవేళ ఉన్నత అధికారులు సూచిస్తే ఇలాగే కొనసాగించనున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Updated Date - 2020-03-23T10:40:55+05:30 IST