పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

ABN , First Publish Date - 2020-11-27T05:18:48+05:30 IST

కోటగిరి పోలీసు స్టేష న్‌ను బోధన్‌ ఏసీపీ రామారావు గురువారం తని ఖీ చేశారు.

పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

కోటగిరి, నవంబరు 26: కోటగిరి పోలీసు స్టేష న్‌ను బోధన్‌ ఏసీపీ రామారావు గురువారం తని ఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్‌లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ రామారావు మాట్లాడుతూ, మండలంలో చోరీలు, ఇతరత్రా సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ మశ్య్చేందర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-11-27T05:18:48+05:30 IST