ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సెర్చ్
ABN , First Publish Date - 2020-12-08T04:01:57+05:30 IST
ప్రజల రక్షణ కోసం గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ డీసీపీ శరత్‌చంద్రపవార్ అన్నారు.

చెన్నూరు, డిసెంబరు 7 : ప్రజల రక్షణ కోసం గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ డీసీపీ శరత్‌చంద్రపవార్ అన్నారు. సోమవారం జైపూర్ ఏసీపీ నరేందర్‌తో కలిసి మండలంలోని బుద్దారం గ్రామంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ శరత్‌చంద్రపవార్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఆపద వచ్చినా 100కు కాల్ చేయాలని కోరారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చెన్నూరు, చెన్నూరు రూరల్, శ్రీరాంపూర్ సీఐలు ప్రమోద్‌రావు, నాగరాజు, కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐలు శివకుమార్, విక్టర్ సంజీవ్, , రవికుమార్, రామకృష్ణ, సీఆర్‌పీఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.