నిందితున్ని పట్టుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-12-02T05:17:23+05:30 IST
మండలంలోని పెంబి తండా సమీపంలో గత ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పెంబి నుంచి సిరికొండ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢికొట్టింది.

పెంబి, డిసెంబరు 1: మండలంలోని పెంబి తండా సమీపంలో గత ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పెంబి నుంచి సిరికొండ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢికొట్టింది. దీంతో సాయిరెడ్డి(35) అక్కడికక్కడే మృతి చెందగా, విజయ్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రమాదానికి కారణమైన హర్వేస్టర్‌తో పాటు వాహనం డ్రైవర్ గుర్‌ప్రిత్‌సింగ్‌ను గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. హర్వేస్టర్ ను రాత్రిపూట నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే క్రిమనల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇందులో ఎస్సై రాజేష్ ఉన్నారు.