ప్లాస్టిక్ రహిత గ్రామాలకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-20T04:21:48+05:30 IST
గ్రామ పంచాయతీలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

-కలెక్టర్ రాహుల్ రాజ్
దహెగాం, డిసెంబరు19: గ్రామ పంచాయతీలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. దహెగాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ స్థాయిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి ఎరువుల తయారీపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిసెంబరు31 లోపు ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ విక్రయించే వారిపై జరిమానా విధించి ప్లాస్టిక్ కనిపించకుండా చూడాలన్నారు. వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ కవర్లు సంచుల్లో పడవేయడంతో మూగ జీవాలు తిని మరణి స్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకుని ఉపయోగించుకునేలా ప్రోత్స హించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోని వారి విద్యుత్ కనెక్షన్ తొలగించాలని, రేషన్ నిలిపి వేయాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు ఇంకుడుగుంత నిర్మించు కోవాలన్నారు. పల్లె ప్రకృతివనాల్లో అన్ని రకాల చెట్లను పెంచాలన్నారు. గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్త వేరు చేసి ఎరువు తయారీ చేయాలని సూచించారు. ఎరువుల తయారీ, మొక్కలు నాటే, నర్సరీల్లో మొక్కలు పెంచే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అధికారులు స్థానికంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రైతులు కల్లాలను నిర్మించుకోవాలన్నారు. ఈ సమా వేశంలో ఎంపీపీ సులోచన, ఎంపీడీఓ సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ రామ్మోహన్ రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.