మొక్కలను సంరక్షించాలి: అదనపు కలెక్టర్ డేవిడ్
ABN , First Publish Date - 2020-05-09T11:05:03+05:30 IST
నర్సరీలలో నాటిన మొక్కలను సంరక్షించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ పేర్కొన్నారు.
మావల, మే8: నర్సరీలలో నాటిన మొక్కలను సంరక్షించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వాఘాపూర్ గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. వాటర్ డే సందర్భంగా మావల గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ఇందులో జడ్పీ సీఈవో కిషన్, డీఆర్‌డీఓ పీడీ రాజేశ్వర్ రాథోడ్, జడ్పీ వైస్ చైర్మన్ ఆరే.రాజన్న, ఎంపీడీవో బండి అరుణ, ఎంపీవో లక్ష్మణ్, ఏపీవో రజని తదితరులు పాల్గొన్నారు.