లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలి
ABN , First Publish Date - 2020-12-29T04:07:27+05:30 IST
హరితహారంలో భాగంగా నర్సరీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. అంగ్రాజుపల్లి, కాసన్‌పల్లి, గంగారం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీలతో పాటు పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు.

కలెక్టర్ భారతి హోళికేరి
అంగ్రాజుపల్లి కార్యదర్శికి నోటీసు
చెన్నూరు, డిసెంబరు 28: హరితహారంలో భాగంగా నర్సరీల్లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. అంగ్రాజుపల్లి, కాసన్‌పల్లి, గంగారం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీలతో పాటు పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. అంగ్రాజుపల్లి పల్లె ప్రకృతి వనం నిర్వహణ సరిగా లేకపోవడంతో కార్యదర్శికి షోకాజ్ నోటీసు ఇవ్వా లని ఎంపీడీవో మల్లేష్‌ను ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశ మైన కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీల నిర్వహణపై అధికారులు తరుచూ పర్యవేక్షణ జరపాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీరందించాలని, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏపీవో గంగాభవానీ, రవీందర్, లక్ష్మణ్, వెంకటేష్ పాల్గొన్నారు.