కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-12-30T06:30:08+05:30 IST
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ అన్నారు.

జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్
మామడ, డిసెంబరు 29 : కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ అన్నారు. మంగళవారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత, తాగునీటి సమస్య, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. చలికాలం కావడంతో కరోనా పట్ల గ్రామాలలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి అన్నారు. చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్‌లు ధరించడం తప్పని సరిగా చేయాలన్నారు. జ్వరము, జలుబు లక్షణాలు ఉన్నట్లయితే కరోనా పరీక్షలు చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టా ల్సిన చర్యల గురించి వైద్యసిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీకాంత్, వైద్యాధికారి మహిత, సీహెచ్‌వో లక్ష్మన్న, సూపర్‌వైజర్లు భోజారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ మధుకర్ రెడ్డి, వెంకట లక్ష్మీ, రవీందర్, సర్పంచ్ హన్మగౌడ్, ఫార్మాసిస్ట్ సతీష్, వైద్య సిబ్బంది ఉన్నారు.