ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-08-20T10:46:52+05:30 IST
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భారతి హోళికేరి

జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
భీమిని: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. బుధవారం భీమిని మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును ఆర్డీవో శ్యామలాదేవి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నందున రాకపోకలను నిషే ధించాలని తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్, ఎంపీడీవో రాధాకృష్ణలకు సూచించారు. వాగులు, చెరువులు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం క లుగుతోం దని, గతంలో ఇద్దరు వాగులో పడి మృతిచెందారని , సమస్యను పరిష్కరించాలని ప్రజలు కలెక్టర్‌కు విన్నవిం చారు. ఎంపీవో ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.