చలి, వేడి గాలులతో జనం బెంబేలు
ABN , First Publish Date - 2020-03-02T12:39:14+05:30 IST
జిల్లాలో రాత్రి వేళల్లో చలి గాలులు, దినం వేళల్లో వేడి గాలులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజులుగా చలి, వేడి

భైంసా, మార్చి 1: జిల్లాలో రాత్రి వేళల్లో చలి గాలులు, దినం వేళల్లో వేడి గాలులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజులుగా చలి, వేడి తీవ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వేసవి కాలం అరంభమవ్వకముందే భానుడి భగభగలు మొదలయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పకుండానే తెలిసిపోతుంది. ఉదయం 10 గంటలు అయ్యిందంటే చాలు సూర్యభగవానుని ప్రతా పం మొదలవుతోంది. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గాను జనాలు గొ డుగులు, క్యాపులు, టవెల్స్ తదితర వాటిని వినియోగిస్తున్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరక చలి తీవ్రత ఉంటోంది. ఈ కారణంగా వేకువ జాము వేళలో పాల,కూరగాయల విక్రయదారులు , పారిశుధ్య కార్మికులు, పేపర్‌బాయ్స్ స్వెట్టర్లు, శాలువాలు తదితర వాటిని చలి నుంచి రక్షణ పొందేందుకు గాను వినియోగిస్తున్నారు. ఉదయం వేళలో ఇక్కడి మార్కెట్లో చాలా మంది చలి మంటలను కాగుతున్నారు. మూడు రోజులుగా జిల్లా పరిధిలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం దినం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్. రాత్రి ఉష్ణోగ్రతలు 18డిగ్రీల సెల్సియస్, శనివారం దినం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ ల సెల్సియస్. రాత్రి ఉష్ణోగ్రతలు 18డిగ్రీల సెల్సియస్, ఆదివారం దినం ఉష్ణోగ్రతలు 36డిగ్రీల సెల్సియస్. రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో దినం ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. రానున్న రోజు ల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి.