బ్యాంకులకు పింఛన్‌దారుల తాకిడి

ABN , First Publish Date - 2020-04-07T10:52:32+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు ఇప్పటికే సామాజిక దూరంతో పాటు మరెన్నో నిబంధనలు పాటి

బ్యాంకులకు పింఛన్‌దారుల తాకిడి

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌6: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలు ఇప్పటికే సామాజిక దూరంతో పాటు మరెన్నో నిబంధనలు పాటి స్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పింఛన్‌ డబ్బులు తీసు కునేందుకు బ్యాంకులకు పింఛన్‌దారులు బారులు తీరారు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఐ, దక్కన్‌ గ్రామీణ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల వద్ద పింఛన్‌ కోసం వచ్చిన లబ్ధిదారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సామాజిక దూరం పాటిస్తూ ఎండలోనే పడిగాపులు కాశారు. కాగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే పనిచేయడంతో ఖాతా దారులు, పింఛన్‌దారులకు ఇబ్బందులు తప్పలేదు.

Read more