కోనప్పపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడి ట్వీట్‌

ABN , First Publish Date - 2020-05-18T10:36:32+05:30 IST

చెట్లను నరికిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్‌ ..

కోనప్పపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడి ట్వీట్‌

చెట్లను నరికాడని ఆరోపణ


కాగజ్‌నగర్‌, మే17: చెట్లను నరికిన సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదివారం    ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. కాగజ్‌నగర్‌-సిర్పూర్‌(టి) ప్రఽధాన రోడ్డుపై ఉన్న 40 చెట్లను కోనప్ప నరికి ఇంటికి తరలించాడని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-18T10:36:32+05:30 IST