ఆశాలకు పనికి తగినవేతనం చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-11T05:55:30+05:30 IST

ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలని, పనికి తగిన వేతనం చెల్లించాని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ అన్నారు.

ఆశాలకు పనికి తగినవేతనం చెల్లించాలి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ అధ్యక్షురాలు

నిర్మల్‌ అగ్రికల్చర్‌ ,డిసెంబరు 10 : ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలని, పనికి తగిన వేతనం చెల్లించాని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ అన్నారు. గురువారం నిర్మల్‌ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశావర్కర్స్‌ యూనియన్‌  సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనారోగులకు సేవలందించిన ఆశాలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం తగదన్నారు. నెలకు రూ. 10వేల వేతనం చెల్లించాలని, సమస్యల సాధన కోసం ఈ నెల 14న జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో విజయ, గంగామణి, రత్నామాల, సుశీల, రాజమణి తదితరులున్నారు. 

Updated Date - 2020-12-11T05:55:30+05:30 IST