రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-03-13T12:49:21+05:30 IST

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కట్లు కలుగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అంకం

రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ఖానాపూర్‌, మార్చ్‌ 12 : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కట్లు కలుగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు. గురువారం ఆంఽధ్రజ్యోతి మినిలో ‘పెద్దాసుపత్రికి సమస్యల సుస్తీ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నింటిని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.


శానిటేషన్‌ పనులు మరింత మెరుగ్గా ఉండాలని ఆసుపత్రిలో సరిపడ సిబ్బంది లేని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రి సూపరిండెండెంట్‌ వంశీమాధవ్‌కు సూచించారు. గైనకాలజిస్టు నియామకంపై ఇదివరకే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే సహకారంతో ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ రాజూరా సత్యం, నాయకులు ఉన్నారు.

Updated Date - 2020-03-13T12:49:21+05:30 IST