పర్యావరణ పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-11-22T03:35:08+05:30 IST
పర్యావరణ పరిరక్ష ణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి కృషి చేయా లని తెలంగాణ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఅండ్ ఎండి. రఘువీర్ పేర్కొన్నా రు.

మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 21 : పర్యావరణ పరిరక్ష ణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి కృషి చేయా లని తెలంగాణ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఅండ్ ఎండి. రఘువీర్ పేర్కొన్నా రు. శనివారం జిల్లాలోని పలు అట వీ క్షేత్రాలను పరిశీలించారు. కాన్‌పూ ర్ 2020 ఈపీ 35 హెక్టా ర్ల విస్తీర్ణం లో ప్రయోగాత్మకంగా చేపట్టిన జిల్లా కేంద్రంలోని ప్లాంటేషన్లను సందర్శిం చారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో మంచిర్యాల, బెల్లం పల్లి, కాగజ్‌నగర్ రేంజ్ అధికారు లతో సమావేశాన్ని నిర్వహిం చారు. అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. యేటా అడ వుల విస్తీర్ణాన్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. అట వీ నిర్మూలన శాతం తగ్గించడానికి, అడవుల సంరక్షణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అందజేశారు. అడవులను సంరక్షించుకునేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంగా కృషి చేసి అడవుల సంరక్షణే ఽధ్యేయంగా ముం దుకు సాగాలని సూచించారు. అడవుల్లో చెట్ల నరికవేతను నిరో ధించాలన్నారు. అరుదైన వృక్ష జాతులను, జంతుజాలాన్ని కాపాడుకోవడం మానవాళి కర్తవ్యమన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి కాగజ్‌నగర్ రేంజ్ అధికారులు రవీందర్‌రెడ్డి, ఇ.కవిత, ప్లాంటేషన్ మేనేజర్లు నాగరాజు, సురేష్‌కు మార్, సైదానాయక్, డీపీఎం రాకేష్, మూడు రేంజ్‌ల సిబ్బంది పాల్గొన్నారు.