ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే హవా
ABN , First Publish Date - 2020-11-28T03:51:59+05:30 IST
వారంతా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మి కులు. నాలాలను, రోడ్లను శుభ్రపరచడం వారి పని.

ఉద్యోగం ఒకటి.. చేసే పని మరొకటి
పారిశుధ్య కార్మికులకు ఇతర విభాగాల్లో డ్యూటీలు
అవసరం లేకున్నా ఆఫీస్‌లో విధులు కేటాయింపు
వీధుల్లో పేరుకుపోతున్న చెత్త కుప్పలు
మంచిర్యాల మున్సిపాలిటీలో పైరవీలదే రాజ్యం
మంచిర్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వారంతా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మి కులు. నాలాలను, రోడ్లను శుభ్రపరచడం వారి పని. కాని వారిలో కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి మరో చోట విధులు వేయించుకుంటున్నారు. అవసరం లేకపోయినా ఆఫీస్‌లో డ్యూటీలు చేస్తున్నారు. ఇస్త్రీ దుస్తు లు నలగకుండా ఆఫీసర్లలాగా వ్యవహరిస్తున్నారు. ఇదే మిటని ప్రశ్నించే అధికారులను పైరవీలతో నోర్లు మూ యిస్తున్నారు. ఫలితంగా వీధుల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తతంగమంతా గ్రేడ్-1 మున్సిపాలిటీగా పేరుపొందిన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతోంది. సంవత్సరాల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా వారిని అక్కడి నుంచి కదిపే వారు లేకుండా పోయారు.
పైరవీలలో వారిదే పైచేయి...
తమకు కేటాయించిన విధులు చేయకుండా పైరవీలతో ఇతర విభాగాల్లో డ్యూటీలు చేయడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే పైచేయిగా నిలుస్తోంది. మున్సిపా లిటీ పరిధిలోని 36 వార్డులకుగాను మొత్తం 317 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 53 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా 264 మంది ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. రెగ్యులర్ కార్మికుల్లో 12 మంది జవాన్లుగా విధులు నిర్వహిస్తుండగా 306 మంది పారిశుధ్య పనులు చేయాల్సి ఉంది. వీరికి అదనంగా 16 మంది కార్మికులు ఎన్‌ఎంఆర్ (నాన్ మాస్టర్ రోల్) పద్ధ తిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 16 మందిలో 5గురు పారిశుధ్య విభాగంలో పని చేస్తుండగా, ఒకరు రెవెన్యూ విభాగంలో మరో 10 మంది ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులు మరో 30 మంది అక్రమంగా ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 40 మంది ఉద్యోగు లు అవసరం లేకపోయినా ఆఫీసులో తిష్టవేయడం గమనార్హం. వీరిలో కొందరు ప్రత్యేక అధికారి పాలన సమయంలో చైర్మన్ చాంబర్‌లో ఏసీ వేసుకొని పడుకోగా అధికారుల దృష్టిలో పడ్డారు. దీంతో కమిషనర్ స్వరూపరాణి హెచ్చరించి వదిలేశారు.
పనులు చక్కబెట్టడంలోనూ దిట్ట
ఎన్‌ఎంఆర్ కింద పనులు చేస్తున్న వారిలో కొందరు పైరవీలు చేస్తూ పనులు చక్కబెడుతూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆఫీసులో విధు లు నిర్వహిస్తున్నందున ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫీల్డ్‌లోకి వెళ్లాల్సి రావడంతో అక్కడ పైరవీలు చేస్తున్న ట్లు తెలుస్తోంది. నేరుగా వినియోగదారులతో సంబంధా లు ఏర్పరుచుకుంటూ అడ్డగోలుగా వసూలు చేస్తూ పను లు చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ఆగ డాలను అడ్డుకోవలసిన అధికారులు పైరవీల కారణంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
అర్హత లేకున్నా డ్రైవర్లుగా చలామణి
ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న వారు పదుల సంఖ్యలో అర్హత లేకున్నా డ్రైవర్లుగా చలామణి అవుతు న్నారు. పైరవీలతో వాహనాలు నడుపుతూ పారిశుధ్య పనుల్లో నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రచారం జరుగు తోంది. మున్సిపాలిటీ పరిధిలో 15 ట్రాక్టర్లు, 23 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. వీటిని నడిపే వారిలో చాలా మందికి అర్హత లేదని తెలుస్తోంది. ట్రాక్టర్లు నడపడానికి హెవీ లైసెన్సు ఉండాల్సి ఉండగా, లర్నింగ్ లైసెన్సు ఉన్న వారు సైతం భారీ వాహనాలు నడుపుతున్నారు. పారిశుధ్య పనుల్లో నుంచి డ్రైవర్లుగా విధులు నిర్వహించేందుకు ఒక్కో ఉద్యోగి సుమారు రూ.20 వేల వరకు ముడుపులు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కంపు కొడుతున్న వీధులు
పారిశుధ్య కార్మికులు పైరవీలతో ఇతర డ్యూటీలు చేస్తుండటంతో వీధులు కంపు కొడుతున్నాయి. 300కు పైగా పారిశుధ్య విభాగంలో పని చేస్తున్నా నాలాలు, డ్రైనేజీలు రోజుల తరబడి శుభ్రం చేయకపోవడమే దీనికి నిదర్శనం. వీధుల్లోనూ ఎక్కడి చెత్తకుప్పలు అక్క డనే దర్శనమిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షించేందుకు రెగ్యులర్ ఉద్యోగుల్లో నుంచి 12 మంది జవాన్లుగా నియమించారు. వీరు తలా మూడు వార్డులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయినా పనులు సక్రమంగా జరగడం లేదు. ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరగడంతోపాటు అదనంగా ఐదు తోపుడు బండ్లు వచ్చినా పనులు సక్రమంగా నిర్వహిం చడం లేదు. ఇదిలా ఉండగా పారిశుధ్య కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరుకావడం కూడా పనులు కుంటుపడటానికి కారణమవుతున్నాయి. సాధార ణంగా పట్టణాల్లో ఉదయం 5 నుంచి 10, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉం టుంది. అయితే దూర ప్రాంతాల నుంచి రావడం మూ లంగా ఆలస్యం జరిగి ఒంటిపూట పనులు మాత్రమే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పారిశుధ్యం కుంటుపడుతోంది.
చర్యలు చేపడతాం
శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్
పారిశుధ్య విభాగంలో పనిచేస్తూ ఇతర డ్యూటీలు చేస్తున్న వారిపై చర్యలు చేపడతాం. ఈ విషయమై కమిషనర్ ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. అవస రం లేకున్నా ఆఫీసులో తిష్టవేయడం సరికాదు. పారిశు ధ్య పనులు చేయకపోతే ఉద్యోగాలు వదులుకోవడం ఉత్తమం. అటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం.