ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-29T05:13:14+05:30 IST

మండలంలోని కాన్పమేడి గూడ రోడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌లను ప్రారంభించినట్లు కో ఆర్డినేటర్‌ పొద్దుటూరి లక్ష్మారెడ్డి తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లు ప్రారంభం

జైనథ్‌, డిసెంబరు 28: మండలంలోని కాన్పమేడి గూడ రోడ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గల తెలంగాణ స్టేట్‌ ఓపెన్‌ స్కూల్‌లో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌లను ప్రారంభించినట్లు కో ఆర్డినేటర్‌ పొద్దుటూరి లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం వీటికి సంబంధించిన వాల్‌ పోస్టర్లను  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ వరకు అడ్మిషన్లు పొందాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, వికలాంగులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడంతో పాటు సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - 2020-12-29T05:13:14+05:30 IST