జిల్లాలో వంద శాతం కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2020-04-14T12:19:48+05:30 IST

జిల్లాలో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు వంద శాతం కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి జిల్లా

జిల్లాలో వంద శాతం కర్ఫ్యూ అమలు

నిర్మల్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు వంద శాతం కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.


జిల్లా లో 19మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యిందని, 14 కంటైన్మెంట్‌ జోన్లు గుర్తించామని, అందులో నిర్మల్‌లో 6, భైంసాలో రెండు, లక్ష్మణచాంద మండలంలోని రెండు(కనకాపూర్‌, రాచాపూర్‌), మామడల మండలంలో న్యూలింగంపల్లి, పెంబిలో రాయదారి, కడెం, నర్సాపూర్‌(జి) మండలంలోని చాక్‌పల్లి  ఉన్నాయన్నారు. ఈ జోన్లలో వైర్‌స నివారణకు సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారితో పాటు ప్రత్యేక వైద్య బృందంతో ఽథర్మల్‌ స్కానల్‌ స్ర్కీనింగ్‌తో చెక్‌ చేస్తున్నట్లు తెలిపారు.


కాగా, నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేందుకు ప్రతీవార్డులో 20-25 ఇళ్లకు ఒక వలంటీర్‌ను గుర్తించి అతనికి పాస్‌ ఇస్తున్న ట్లు తెలిపారు. అంతేకాకుండా నిర్మల్‌ పట్టణంలో ఎనిమిది చోట్ల కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని,  రోజు విడిచి రోజు అమ్మకాలు (ఒకరోజు నాలుగు మార్కెట్లలో, మరో రోజు నాలుగు మార్కెట్లలో) ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం 10గంటల వరకు జరుగుతాయని తెలిపారు. చికెన్‌, మటన్‌ వద్ద ప్రభుత్వ నిబంధనల మేరకు భౌతికదూరం, క్యూ లైన్‌ పా టిస్తున్నట్లు సంబంధిత దుకాణం యజమాని నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌లను కలెక్టర్‌ సూచించారు. ఆతర్వాత ఎస్పీ శశిధర్‌ రాజు మాట్లాడుతూ జిల్లా రెడ్‌జోన్‌లో ఉందని, ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలన్నారు. సమావేశంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, అదనపు కలెక్టర్‌ ఏ.భాస్కర్‌ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్‌, అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకట్‌ రెడ్డి, భైంసా మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ జాబీర్‌ అహ్మద్‌, భైంసా ఆర్డీవో రాజు, డీఎస్పీ ఉపేంధర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు ఎన్‌.బాలకృష్ణ, ఖాదీర్‌ తదితరులు పాల్గొన్నారు. 


సారంగాపూర్‌: మండలంలోని సిరిపెల్లిలో గ్రామ సమీపంలో గల రాష్ట్ర సరిహద్దును సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ పరిశీలించారు.  పకడ్బందీగా నిఘాను పెట్టాలని పోలీసు సిబ్బందికి కలెక్టర్‌ సూచించారు. 

Updated Date - 2020-04-14T12:19:48+05:30 IST