మైనర్‌పై అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2020-12-15T06:06:04+05:30 IST

మైనర్‌ బాలికపై ఆర్‌ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టి స్థానిక పోలీసు స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు.

మైనర్‌పై అసభ్య ప్రవర్తన

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, పోక్సో యాక్టు కింద కేసు 

నార్నూర్‌, డిసెంబరు 14: మైనర్‌ బాలికపై ఆర్‌ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టి స్థానిక పోలీసు స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. తాడిహత్నూర్‌ గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు ముస్తాక్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక వైద్యం కోసం చికిత్స కేంద్రానికి రాగా సదరు వైద్యుడు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అత్యాచారానికి యత్నించగా బాలిక భయాందోళను గురై ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి సదరు ఆర్‌ఎంపీని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అర్హత లేని ప్రైవేటు వైద్యులను నమ్మవద్దని, నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Updated Date - 2020-12-15T06:06:04+05:30 IST