యువకుడిని రిమ్స్‌కు తరలించిన అధికారులు
ABN , First Publish Date - 2020-03-24T12:43:30+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వై రస్ నేరడిగొండలో కలకలం రేపింది సోమవారం మండల కేం ద్రంలో తువారే సాయి

నేరడిగొండ మార్చి 23 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వై రస్ నేరడిగొండలో కలకలం రేపింది సోమవారం మండల కేం ద్రంలో తువారే సాయి అనే యువకుడికి కరోనా సోకిందని అను మానంతో స్థానిక వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు సమాచారం అందించారు. తువారే సాయిని ఆ దిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. మూడు రోజుల క్రితం ఆదిలాబా ద్ రామ్‌నగర్ నుంచి నేరడిగొండలో గల తమ బంధువుల ఇంటికి వచ్చిన సాయికి జలుబు, దగ్గు విపరీతంగా రావడంతో అనుమా నం వచ్చి పక్కింటివారు స్థానిక సర్పంచ్‌కు సమాచారం అందిం చారు.
వెంటనే స్థానిక అధికారులు స్పందించి సాయిని రిమ్స్‌కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించగా, టైఫాయిడ్ అని తేలింది. వి పరీతంగా జలుబు, దగ్గు ఉండడంతో కరోనా బారిన పడి ఉండవ చ్చని స్థానికుల అనుమానం మాత్రమేనని వైద్యాధికారి ఆనంద్ కుమార్ తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అవగా హన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంఆర్ ఐ మీరాబాయి, హెచ్‌ఈవో హరికుమార్‌గైడ్, సూపర్‌వైజర్ రాంన రేష్ తదితరులు పాల్గొన్నారు.