నర్సరీలను పరిశీలించిన అధికారులు
ABN , First Publish Date - 2020-04-28T05:45:01+05:30 IST
బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన నర్సరీని సోమవారం పంచాయతీ రాజ్ సబ్ కలెక్టర్ డేవిడ్‌తో

బోథ్, ఏప్రిల్ 27: బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన నర్సరీని సోమవారం పంచాయతీ రాజ్ సబ్ కలెక్టర్ డేవిడ్‌తో పాటు పీడీ రాథోడ్ రాజేశ్వర్ పరిశీలించారు. నర్సరీలో నాటిన మొక్కలను బతికించాలని ఈ ఏడాది సాధ్యమైనంత తొందరగా మొక్కలను నాటించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సుందర్ యాదవ్, ఏపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.