జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2020-10-03T10:33:44+05:30 IST

కొవిడ్‌ వారియర్స్‌గా సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలని జర్నలిస్టు సంఘాల ..

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

ఏసీసీ, అక్టోబరు 2: కొవిడ్‌ వారియర్స్‌గా సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని జర్నలిస్టులకు  రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టర్‌ భారతి హోళికేరికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ  రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారని చెప్పారు.  మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.


కొవిడ్‌ వారియర్స్‌గా నిలిచిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా వర్తింపజేయాలని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పొరేట్‌ ఆస్పత్రులలో ప్రత్యేక వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మంగపతి చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపిరెడ్డి ప్రకాష్‌ రెడ్డి, ఎలకా్ట్రనిక్‌ మీడియా అధ్యక్షుడు పింగళి సంపత్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ సంతోష్‌, జిల్లా నాయకులు కేశెట్టి వంశీకృష్ణ, బిరుదుల దేవరాజ్‌, ఉదయ్‌ కుమార్‌, పూరెళ్ళ లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, సతీష్‌ కుమార్‌ యాదవ్‌, వినోద్‌, ఉపేందర్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T10:33:44+05:30 IST