లిఫ్టు పనిచేయక రోగులకు అవస్థలు

ABN , First Publish Date - 2020-11-28T04:44:04+05:30 IST

నిత్యం వందల మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వ ప్రధానాసుపత్రి రిమ్స్‌లో లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన లిఫ్టులు పనిచేయడం లేదు. దీంతో వివిధ వ్యాధులతో బాధపడుతూ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి బంధువులు మెట్లను ఆశ్రయించి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

లిఫ్టు పనిచేయక రోగులకు అవస్థలు
మెట్ల మార్గంలో వెళ్తున్న రోగులు, బంధువులు

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు 27: నిత్యం వందల మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వ ప్రధానాసుపత్రి రిమ్స్‌లో లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన లిఫ్టులు పనిచేయడం లేదు. దీంతో వివిధ వ్యాధులతో బాధపడుతూ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారి బంధువులు మెట్లను ఆశ్రయించి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ను అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోక పోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. 


Read more