ఇక పారదర్శక పాలన!

ABN , First Publish Date - 2020-02-08T11:28:16+05:30 IST

ప్రజల కోసమే పని చేసే ప్రభుత్వ కార్యాలయాలలో పరదాలు వేసుకు ని పని చేయడం ఏమిటి? అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఖచ్చితంగా పారదర్శకతను

ఇక పారదర్శక పాలన!

పనిచేసే చోట పరదాలు ఎందుకు?

పారదర్శక పాలన కోసమే మనం ఉన్నాం

కొత్త కలెక్టర్‌ ఫారూఖీ సంస్కరణలు షురూ

నిర్మల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రజల కోసమే పని చేసే ప్రభుత్వ కార్యాలయాలలో పరదాలు వేసుకు ని పని చేయడం ఏమిటి? అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఖచ్చితంగా పారదర్శకతను పాటించాల్సిం దే. నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయా ల్లో ఇకపై పరదాలు లేని పాలన సాధిద్దామని నిర్మల్‌ జిల్లా కొత్త కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అది ముందుగా తన కార్యాలయంతోనే ప్రారంభించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌తో పాటు, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర పర్యవేక్షణ సిబ్బంది గదులకు సంబంధించిన పరదాలు అన్నింటిని తొలగించారు. కిటికీలకు ఉన్న విండో కర్టెన్లు కూడా తీసి వేయించారు. కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు  అక్కడ పని చేసే అధికారులు ఉద్యోగులు అందరూ కనిపించేలా పాలన సాగాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌లో ఏసీ కట్‌

విశాలమైన కార్యాలయం, చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఉన్న కలెక్టర్‌ కార్యాలయంలో ఏసీల అవసరం ఏముంది? అంటూ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ముందుగా తన ఛాంబర్‌లో ఏసీ వాడకాన్ని సైతం నిలిపి వేశారు. సామాన్య ప్రభుత్వ కార్యాలయాల మా దిరిగానే కలెక్టర్‌ కార్యాలయం ఒకటని, కొత్త కలెక్టర్‌ తీసుకున్న ఈ నిర్ణయం అన్ని శాఖల ఉన్నతాధికారుల ను ఆలోచింపజేస్తోంది.

పనిలేని అధికారుల జాబితా సిద్ధం

ప్రభుత్వ శాఖల్లో పని లేకుండా ఉన్న ఉన్నతాధికారు ల జాబితాను జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అనేక కీలకమైన ప్రభు త్వ శాఖల్లో ఉన్నతాధికారులు కొరత ఉన్నందున అలాం టి చోట్లకు.. పని లేకుండా ఉన్న జిల్లా స్థాయి అధికారులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్‌ కార్యాలయాలలో అధికారులకు ప్రస్తుతం పని భారం లేదని కలెక్టర్‌ దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. వెంటనే జడ్పీ సీఈవో సుధీర్‌ని పిలిపిం చి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం వంటి కార్యక్రమాల అమలు కు నోడ్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఆదేశించారు. ఈ నిర్ణయం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎవరైనా సాయంత్రం 4గంటల తర్వాతే..

కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే వాళ్లు ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు వీలు లేదు. సామాన్యులు మొదలుకొని ఎవరైనా సరే కలెక్టరేట్‌కు సాయంత్రం 4గంటల తర్వాతనే రావాలని హుకుం జారీ చేశారు. ఇందులో ధనిక, పేద తేడా లేదని స్పష్టం చేశారు. ప్రతి రోజు నాలుగు నుండి 5గంటల నడుమ ప్రజల కోసం సమయం ఇచ్చారని కలెక్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం కూడా అన్ని వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. 

సన్మానాలకు చెక్‌.. చేయూతకు విష్‌

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ ఫారూఖీని కలిసేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజ లు, ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను మర్యాదపూర్వకంగా పలకరిస్తున్నారు. అయితే వారు తనను సన్మానం చేసేందుకు తెస్తున్న శాలువా లు, మెమోంటోలు, పూలదండలు, బొకేలను కలెక్టర్‌  సున్నితంగా తిరస్కరిస్తున్నారు. హంగు ఆర్భాటాలకు తావివ్వకుండా అందరినీ పలకరిస్తున్నారు. కానీ సన్మానాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అయితే అదే క్రమంలో పేదలకు అండగా ఉండే కార్యక్రమాల విషయంలో మాత్రం ఆయన అభినందిస్తున్నారు. పేద విద్యార్థులకు చేయూత ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌ను కలిసి పెన్నులు, పెన్సిల్స్‌, నోట్‌ పుస్తకాలు అందజేసిన వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘం నాయకులను కలెక్టర్‌ అ భినందించారు. అలాగే మరికొన్ని సంఘాలు ఇలాంటి సామాజిక కార్యక్రమాల అమలు కోరుతూ తీసుకువచ్చిన వస్తువులను గౌరవంగా స్వీకరించి వారిని అభినందిస్తున్నారు. కొత్త కలెక్టర్‌ అమలు చేస్తున్న సంస్కరణ లు అన్ని వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి.


Updated Date - 2020-02-08T11:28:16+05:30 IST