పత్తాలేని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ

ABN , First Publish Date - 2020-11-28T04:32:17+05:30 IST

ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైద్య సిబ్బందితో సహా మండల ప్రజా ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం 3 నెలలకోసారి సమావేశం నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఉమ్మడి తాంసి మండలం నుంచి భీంపూర్‌ మండలంగా ఏర్పాటైన నేటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవు తున్నాయి.

పత్తాలేని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ
భీంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి

పరిష్కారానికి నోచుకోని సమస్యలు

పట్టించుకోని అధికారులు

భీంపూర్‌, నవంబరు 27: ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైద్య సిబ్బందితో సహా మండల ప్రజా ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం 3 నెలలకోసారి సమావేశం నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఉమ్మడి తాంసి మండలం నుంచి భీంపూర్‌ మండలంగా ఏర్పాటైన నేటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. అదే విధంగా  ఆసుపత్రికి వచ్చే నిధుల వివరాలను ప్రజా ప్రతినిధులకు తెలియ కుండానే పాత ఉమ్మడి మండల (తాంసి) సిబ్బంది ఖర్చు చేస్తున్నారని ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. వైద్య సిబ్బంది మండల ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం అందించడం లేదని భీంపూర్‌ జడ్పీటీసీ కుమ్రసుధాకర్‌ వాపోయారు. అదే విధంగా జడ్పీటీసీ అయిన తనను, ఎంపీపీ, సర్పంచ్‌లను కమిటీ సమావేశంలో ఉంచాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అదే విధంగా ఆసుపత్రిలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీస వసతులు కల్పించడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీంపూర్‌ మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి భీంపూర్‌ మండలానికి రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. కరోనాపై అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రిలో కమిటీ ఉందని తెలియదు..

ఫ జడ్పీటీసీ సభ్యుడు కుమ్ర సుధాకర్‌

ఆసుపత్రి అభివృద్ధి కోసం కమిటీ ఉందని ఇప్పటి వరకు వైద్య సిబ్బంది మాకు ఎలాంటి సమాచారం అందించ లేదు. ఆసుపత్రి అభివృద్ధి కోసం కమిటీ ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో నూ తన కమిటీని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేయాలి. 

Read more