‘పీఎం, ఎంపీల చిత్రాలను వేయాలి’

ABN , First Publish Date - 2020-11-26T05:47:52+05:30 IST

రైతు వేదికలపై ప్రధాన మంత్రి మోదీ, జిల్లా ఎంపీ సోయం బాపురావు చిత్రాలను వేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బుఽధవారం మండలంలోని తరోడా గ్రాంలో రైతు వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు.

‘పీఎం, ఎంపీల చిత్రాలను వేయాలి’
తరొడా గ్రామంలో రైతు వేదిక వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీనాయకులు

ముథోల్‌, నవంబరు 25: రైతు వేదికలపై ప్రధాన మంత్రి మోదీ, జిల్లా ఎంపీ  సోయం బాపురావు  చిత్రాలను వేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బుఽధవారం  మండలంలోని తరోడా గ్రాంలో రైతు వేదిక  వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యలయంలో తహసీల్దార్‌ లోకేశ్వర్‌రావుకు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్‌  భూమేష్‌ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన రైతు వేదికలపై కేసీఆర్‌, ఎమ్మెల్యే చిత్రపటాలను వేస్తున్నారని, అలాగే పీఎం, ఎంపీల చిత్రపటాల ను వేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో రవి, భు జంగ్‌రావు, రామకృష్ణ, రామకృష్ణ, గణే్‌ష ఉన్నారు.

భైంసా రూరల్‌: రైతువేదిక భవనాలపై పీఎం, ఎంపీల చిత్రాలను వేయాలని  కోరుతూ కుబీర్‌ బీజేపీ నాయకులు మండలకేద్రంలోని తహసీల్దార్‌ ప్రభాకర్‌ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. వారిలో పార్టీ ఉపాధ్యక్షుడు తలోడ్‌ శ్రీనివాస్‌, స్ర్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గంగాశేఖర్‌, మండల అధ్యక్షుడు రాథోడ్‌, సు దం పట్టణ అధ్యక్షుడు గణపతి, తదితరులున్నారు. 

Updated Date - 2020-11-26T05:47:52+05:30 IST