తొమ్మిది నెలల బాబుకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-25T10:36:34+05:30 IST

జిల్లాలో బుధవారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన 9నెలల బాబుకు వచ్చింది.

తొమ్మిది నెలల బాబుకు కరోనా పాజిటివ్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌24:  జిల్లాలో బుధవారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయింది. కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం గ్రామానికి చెందిన 9నెలల బాబుకు వచ్చింది. సోమవారం మొత్తం 69 మంది రక్త నమూనాలను సేకరించి పంపారు. వీరిలో మంగళవారం 19 మంది ఫలితాలు రాగా అందరికీ నెగటివ్‌గా తేలాయి. మిగిలిన 50 మంది ఫలితాలను బుధవారం వెల్లడించగా కేవలం 9నెలల బాబుకు మాత్రమే కరోనా నిర్ధారణ అయింది. ఇంతకుముందే బాబు తల్లిదండ్రులిద్దరికీ కరోనా వచ్చింది. వీరు ఇటీవలే ఢిల్లీ నుంచి ఈసుగాంకు వచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా బుధవారం మరో 10 మంది నమూనాలను పరీక్షల కోసం వరంగల్‌ పంపనున్నారు. వీటి ఫలితాలు గురువారం వచ్చే అవకాశం ఉంది.  

Updated Date - 2020-06-25T10:36:34+05:30 IST