ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-11T05:36:15+05:30 IST

ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం లో ప్రతిఒక్కరూ పాల్గొని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీ ల్దార్‌ బత్తుల విశ్వంబర్‌ అన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌

దస్తూరాబాద్‌, డిసెంబరు 10 : ఓటరు నమోదు ప్రక్రియ కార్యక్రమం లో ప్రతిఒక్కరూ పాల్గొని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీ ల్దార్‌ బత్తుల విశ్వంబర్‌ అన్నారు. మండలంలోని అన్ని పార్టీల నాయకుల తో మీటింగ్‌ నిర్వహించారు. మండలంలో ఓటరు నమోదు కార్యక్రమం కొ నసాగుస్తుండడంతో అన్ని పార్టీల వారు సహకరించాలన్నారు. 18 ఏళ్లు నిం డిన యువతీ, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఓటరు లిస్టులో తప్పులు ఉంటే సరి చూసుకోవాలి

సోన్‌ : ఓటరు లిస్టులోని తప్పులను సరి చూసుకోవాలని తహసీల్దార్‌ లక్ష్మి అన్నారు. గురువారం తహసీల్‌ కార్యాలయంలో ఓటరు లిస్టు 2021లో మార్పులపై అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మార గంగారెడ్డి, మోహినొద్దీన్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

భైంసా క్రైం: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమో దు చేసుకోవాలని తహసీల్దార్‌ నర్సయ్య అన్నారు. గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు స మయం ఉన్నదని ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కా ర్యక్రమంలో డీటీ రాంచందర్‌, ఆర్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

ఓటరు లిస్టులో తప్పిదాలు సవరించుకోవాలి

కుభీర్‌: ఓటరు లిస్టు జాబితాలను ఆయా పార్టీల నాయకులు పరిశీలించి తప్పిదాలుంటే సవరించుకోవాలని తహసీల్దార్‌ ప్రభాకర్‌ అన్నారు. గురువా రం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో అఖిల పక్షం నాయకు లతో సమావేశం నిర్వహించి ఓటరు లిస్టుపై చర్చ నిర్వహించారు. గులాబ్‌, శేఖర్‌, జావిద్‌ఖాన్‌, కందూర్‌ సాయినాథ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:36:15+05:30 IST