పులుల సంచారంలో కొత్త కోణం.. అటవీ అధికారుల పనేనట!

ABN , First Publish Date - 2020-12-10T17:52:46+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి వ్యవహారంలో కొత్త కోణం బయటకు వచ్చింది. అటవీశాఖ అధికారులే కావాలని పులులను వదిలినట్లు ఆదివాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పులుల సంచారంలో కొత్త కోణం.. అటవీ అధికారుల పనేనట!

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి వ్యవహారంలో కొత్త కోణం బయటకు వచ్చింది. అటవీశాఖ అధికారులే కావాలని పులులను వదిలినట్లు ఆదివాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల వ్యవహారంలో ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అటవీ అధికారులు పులులను వదిలి హంగామా సృష్టిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవి నుంచి తమను దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పులిని చంపేందుకు మాకు ఒక్క నిమిషం పట్టదు

తన చెల్లిని పెద్ద పులి చంపేసిందని కొండపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పులిని చంపడానికి తమకు ఒక్క నిమిషం కూడా పట్టదని, కానీ చట్టాలకు లోబడి తాము ఆ పని చేయడం లేదని చెప్పాడు. తన చెల్లిని పులి చంపిన కేసులో అటవీ అధికారులపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కానీ తాము ఆ పులిని చంపితే అటవీ చట్టం కింద కేసు పెట్టి జీవిత ఖైదు చేస్తారని ‘ఏబీఎన్’తో అతడు వాపోయాడు. పులుల సంచారంలో కొత్త కోణం పూర్తి కథనం కోసం వీడియో చూడగలరు.

Updated Date - 2020-12-10T17:52:46+05:30 IST