నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-19T12:34:59+05:30 IST

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. బుధవారం కలెక్టర్‌

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

 కలెక్టర్‌ భారతి హోళికేరి


చెన్నూర్‌, మార్చి 18: నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. బుధవారం కలెక్టర్‌ మండలంలోని నర్సరీలను పరిశీలిం అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీలలో మొక్కల పెంపకం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జూన్‌ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో మొక్కలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


గత సంవత్సరం నర్సరీలో ఉన్న మొక్కలను ఎందుకు నిర్లక్యంగా వదిలేశారని సంబంధిత అధికారులపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవో శేషాద్రికి ఫోన్‌ చేసి అక్కడికి రప్పించి కత్తెరశాల, బాహురావుపేట ఈజీఎస్‌ టీఏలు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘట నలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యుద్ద ప్రాతిపదికన బ్యాగుల్లో విత్తనాలు వేసి మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో మల్లేష్‌, ఏపీవో గంగాభవాని ఉన్నారు.


పట్టణ ప్రగతిపై అసంతృప్తి

చెన్నూర్‌ మున్సిపాలిటిలో పట్టణ ప్రగతిపై కలెక్టర్‌ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాపుతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్క డ చూసినా చెత్త చెదారంతో నిండి ఉందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోక పోతే కఠిన చర్యలు తప్పవన్నారు. మళ్లీ చెన్నూర్‌ను సందర్శిస్తానని, అప్పటి లోపు పట్టణ ప్రగతిలో మార్పు రావాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిపై అదనపు కలెక్టర్‌ ఐలా త్రిపాఠికి ఫోన్‌ చేసి చెన్నూర్‌ను సందర్శించాలని సూచించారు.


ఫోన్‌ ద్వారా విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ ఐలా త్రిపాఠి చెన్నూర్‌ చేరుకొని పట్టణంలోని పలు కాలనీల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పట్టణ ప్రగతిలో ఎందుకు మార్పు రావడం లేదని కమిషనర్‌ బాపు ను ప్రశించారు. ఇప్పటికైనా మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ ఐలా త్రిపాఠి హెచ్చరించారు.

Updated Date - 2020-03-19T12:34:59+05:30 IST