ఓటర్లుగా నమోదు చేయించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-16T04:00:51+05:30 IST

ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కు నిర్భయం గా వినియోగించుకొని సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్నికల ఓట ర్ల జాబితా పరిశీలకులు, సాంఘిక సంక్షేమ శాఖ కమి షనర్‌ యోగితా రాణా అన్నారు.

ఓటర్లుగా నమోదు చేయించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఓటర్ల జాబితా పరిశీలకులు యోగితా

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 15: ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కు  నిర్భయం గా వినియోగించుకొని సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్నికల ఓట ర్ల జాబితా పరిశీలకులు, సాంఘిక సంక్షేమ శాఖ కమి షనర్‌ యోగితా రాణా అన్నారు. మంగళవారం కలె క్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హొళికేరితో కలిసి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబి తా పరిశీలకురాలు మాట్లాడుతూ ఓటుతో సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని అభివృద్ధిలో ముందడుగు వేయవచ్చన్నారు. నూతన ఓటర్ల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించి 18 సంవత్సరాలు నిండి అర్హత గల ప్రతీ ఒక్కరి వివరాలను నమోదు చేయాల న్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు నమోదులో అధికారులు, రాజకీయ పార్టీ ల నాయకులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఓటరు జాబితాలో న మోదు, తొలగింపులు, సవరణ చేయాల న్నారు. జనవరి 15న తుది జాబితా ప్రచురించడం జరు గుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు తమ వివరాలను బూత్‌స్థాయి అధికారుల వద్ద సంబంధిత వెబ్‌సైట్‌లో, మొబైల్‌ యాప్‌లో, 1950 హెల్ప్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకో వాలన్నారు. జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్‌ 2021 ప్రకారం 7 లక్షల 33 వేల 424 మంది ఓటర్లు ఉన్నారన్నారు.  అనం తరం బూత్‌ స్థాయి అధికారులు, ఎన్నికల రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరిపి పలు సూచనలు, సలహాలు చేశారు జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఆర్డీవోలు రమేష్‌, శ్యామలాదేవి,  తహ సీల్దార్లు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:00:51+05:30 IST